ఉపాధ్యాయుడిగా మన రాష్ట్రపతి..

225
pranab mukherjee as teacher
pranab mukherjee as teacher
- Advertisement -

పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. పాఠశాలకూ, పాఠ్య బోధన ద్వారా ప్రగతిని నిర్దేశించే ఉపాధ్యాయుడికీ సంబంధం పాఠశాల ప్రాంగణంతో ముడిపెట్టకూడదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కరలేదు. బ్రతుకుతెరువుకోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తీ ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని పాఠశాల నుండి చూపించే ఉద్యోగస్తుడూ ఉపాధ్యాయుడే.

అందుకు తాను కూడా అతీతం కానని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌లోని డా. రాజేంద్ర ప్రసాద్‌ సర్వోదయ విద్యాలయంలోని 11, 12వ తరగతి విద్యార్థులను ఆయన ప్రత్యేక క్లాస్‌ తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రత్యేక తరగతికి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంతా డీడీ(న్యూస్‌), డీడీ భారతి ఛానళ్లలో ఉదయం 10.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు. రాష్ట్రపతి అధికారిక వెబ్‌సైట్‌, రాష్ట్రపతి భవన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో కూడా ప్రసారమైంది.

రాజకీయాల్లోకి రాకముందు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఉపాధ్యాయుడు, పాత్రికేయుడిగా పనిచేశారు. గతేడాది గురుపూజోత్సవం రోజున ఇదే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అభ్యర్థన మేరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతి తీసుకునేందుకు రాష్ట్రపతి అంగీకరించారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈనెల 8వ తేదీన నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 5న డాక్డర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన జయంతి నాడు నిర్వహించడం ఆనవాయితి. సెప్టెంబర్‌ 5న వినాయక చవితి ఉండటంతో ఈ నెల8న అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించాలని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నిర్ణయించారు.

- Advertisement -