అంత్యక్రియలు..ప్రపంచ రికార్డు!

4
- Advertisement -

ప్రసిద్ధ గాయకుడు జూబిన్ గార్గ్ 2025 సెప్టెంబర్ 19న సింగపూర్‌లో కన్నుమూశారు. గాయకుడు స్కూబా డైవింగ్‌కి వెళ్లిన సమయంలో జరిగిన దురదృష్టకరమైన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకాల మరణంతో దేశమంతటా, ముఖ్యంగా అసోంలో, తీవ్ర విషాదం నెలకొంది.

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు అరుదైన రికార్డు దక్కింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది అంత్యక్రియలు. లక్షలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు అభిమానులు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి.

అంత్యక్రియలు అసోంలోని కమరకుచి గ్రామంలో నిర్వహించారు. మొదట అంత్యక్రియలు ఉదయం 8 గంటలకు నిర్వహించాలనుకున్నారు, కానీ ఆటాప్సీ (శవపరీక్ష) పూర్తైన తర్వాతే నిర్వహించారు. జూబిన్ మరణం సంగీత ప్రపంచానికీ, ఆయన అభిమానులకీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Also read:తాల్ హెల్త్‌ఫెస్ట్ 2025కు అతిథిగా కేటీఆర్‌

- Advertisement -