జోర్డాన్‌లో వలస కార్మికుల ఆవేదన

18
- Advertisement -

ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్ లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను Telangana CMO పట్టించుకోకపోవడం దుర్మార్గం. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బిఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్ అయితే, ఇప్పడు వలసలు మల్లా మొదలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యోగాలు కరువై ఎడారి ప్రాంతాలకు వలస పట్టే దుస్థితి వచ్చింది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే.. కాంగ్రెస్ పార్టీ వలస కార్మికుల కుటుంబాలను సైతం దారుణంగా వంచించింది.

అభయ హస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది తప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదు. ఏడాదిన్నర పాలన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ ఏం చేస్తున్నట్లు? ,గల్ఫ్ కార్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ సభ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లు? ,మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సంక్షేమ బోర్డు, గల్ప్ సంక్షేమ బోర్డులకు అతీ గతి లేదు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇప్పటికీ దిక్కులేదు.

Also Read:కిష్కిందపురి..ఓటీటీ డేట్ ఫిక్స్!

- Advertisement -