జింక్ లోపమా..ఇవి తినండి!

62
- Advertisement -

స్త్రీ పురుషుల ఆరోగ్య సంరక్షణలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీర్ణ వ్యవస్థలోని సమస్యలను దూరం చేయడంలోనూ, జుట్టు బలంగా మారడంలోనూ, పురుషుల్లో శుక్రకణాల సంఖ్యను పెంచడంలోనూ జింక్ ఎంతో అవసరం. అందుకే సాధారణంగా ప్రతిరోజూ పురుషులకు 11 మిల్లీ గ్రాములు, స్త్రీలకు 8 మిల్లీగ్రాముల జింక్ కావాల్సి ఉంటుంది. ఇది మాంసాహారంలో అధికంగా ఉంటుంది. అందువల్ల చాలామంది శాఖాహారులు జింక్ లోపం తో బాధపడుతూ ఉంటారు. అయితే శాఖాహారులకు కూడా జింక్ ను పుష్కలంగా అందించే ఆహార పదార్థాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

వేరుశనగ
దీనిని బలవర్థకమైన పోషకాహారంగా పేర్కొంటూ ఉంటారు ఆహార నిపుణులు. ఇందులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. అలాగే జింక్ కంటెట్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శాఖహరులు ప్రతిరోజూ ఓ గుప్పెడు వేరు శనగలను తింటే మంచిది.

బఠానీ
బఠానీలలో కూడా జింక్ పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల బఠానీలలో 2 గ్రాముల జింక్ లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ స్నాక్స్ రూపంలో బఠానీలను ఆహారంగా చేర్చుకుంటే జింక్ జింక్ లభిస్తుంది.

దానిమ్మ
దానిమ్మ పండులో జింక్ ఎక్కువగా లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. తద్వారా హిమోగ్లోబిన్ శాతం కూడా పెరుగుతుంది.

ఇంకా అవగాడో, వాల్ నట్స్, వెల్లుల్లి, పుట్టగొడుగులు వంటి వాటిలో కూడా జింక్ సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి శాకాహారులు వీలైనంత వరకు ప్రతిరోజూ వీటిని ఆహార డైట్ లో చేర్చుకుంటే జింక్ లోపాన్ని అధిగమించవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Also Read:బోడ కాకరకాయలు తింటే.. ఎన్నో రోగాలు దూరం!

- Advertisement -