అక్కడ నీటిని పోదుపుగా వాడండి…

95
bcci
- Advertisement -

ప్రపంచంలో మూడింట ఒకవంతు భూమి ఉన్న నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్‌ జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు ఆల్టిమేటం జారీ చేసింది కారణం అక్కడ ఉన్న నీటి కొరత. బాత్ రూముల్లో గంటలు గంటలు ఉంటూ నీటిని వృథా చేయొద్దని సూచించింది. ఐదు నిమిషాల్లో స్నానాలు ముగించుకోని..నీటిని ఆదా చేయాలని ఆదేశించింది.

జింబాబ్వేలో నీటి కొరత ఉందని..ముఖ్యంగా హరారేలో ప్రజలు నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే వన్డే సిరీస్ హరారేలోనే జరగాల్సి ఉండటంతో..నీటిని జాగ్రత్తగా వాడాలని క్రికెట్లకు సూచించినట్లు చెప్పారు. త్వరగా స్నానాలు చేసి..నీటిని ఆదా చేయాలని క్రికెట్లకు సూచించామన్నారు. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ ఫూల్స్లో జలకాలాటలు రద్దు చేసినట్లు తెలిపాడు.

ప్రస్తుతం ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నీటిని వృథా చేయొద్దని బీసీసీఐ సూచించినట్లు చెప్పారు. ఈ క్రమంలో తాము తక్కువ నీటినే వాడుతున్నామన్నారు. ఇక్కడ పిచ్ లు కూడా డ్రైగానే ఉన్నాయని..వాటికి పట్టడానికి కూడా నీళ్లు లేవన్నారు. గతంలో సౌతాఫ్రికా టూర్ కు వెళ్లినప్పుడు టీమిండియా నీటి కొరతను ఎదుర్కొన్నట్లు విన్నానని..కానీ ఇప్పుడు ప్రత్యక్షం చూస్తున్నాని చెప్పుకొచ్చారు.

కరువు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో.. ప్రతి ఏడాదీ ఈ సీజన్ లో నీటి కొరత సర్వసాధారణం. గుక్కెడు నీటి కోసం అక్కడ జనం తిప్పలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం బోర్లు, కుంటల దగ్గర గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఇక 2019 లో అయితే అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఈ సారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు.

- Advertisement -