ఇవాళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు కల్పించే అంశాలపైనే చర్చలు కేంద్రీకృతమవుతాయని చెప్పారు జెలెన్‌స్కీ.అలాగే రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ‘ప్రాంతీయ అంశాలు’ ప్రస్తావిస్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతిపాదనకు తన మద్దతు లభించకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు ట్రంప్. ఫ్లోరిడాలో వీరిద్దరి భేటీకి ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జెలెన్స్కీతో సమావేశం బాగానే జరుగుతుందని భావిస్తున్నాను. అలాగే వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా అన్నీ సవ్యంగా ఉంటాయని అనుకుంటున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా ట్రంప్ ప్రయత్నాలు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జెలెన్స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు సమావేశాలు నిర్వహించారు. ఆగస్టులో పుతిన్ అలాస్కా వెళ్లి ట్రంప్‌తో ఉన్నతస్థాయి సదస్సులో పాల్గొన్నారు. ఆ సమావేశాన్ని ఇరువురు నేతలు సానుకూలంగా అభివర్ణించారు.
అయితే ఆ సమ్మిట్ అనంతరం చర్చలు కొంత అడ్డంకిని ఎదుర్కొన్నప్పటికీ, అమెరికా–రష్యా మధ్య సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రనేతలు, దౌత్యవేత్తలు తరచూ పరస్పరం సమావేశాలు జరుపుతున్నారు. ప్రస్తుతం చర్చలో ఉన్న 20 అంశాల ప్రణాళిక సుమారు 90 శాతం సిద్ధమైంది అని జెలెన్స్కీ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ కూడా పాల్గొనే ఒక ఫార్మాట్‌ను తప్పకుండా కనుగొనాలి అన్నారు.
Also Read:డెస్క్ జర్నలిస్టుల మీద ఎందుకు వివక్ష?

