జీ 5 ఇండియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ ప్లాట్ ఫారం కాగా, తన వేదిక ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన అలా చిత్రాన్ని విడుదల చేసింది. శరత్ పాలంకి రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భార్గవ్ కొమీర, శిల్పిక మాళవిక, అంకిత్ కొయ్యా మరియు రోహిత్ రెడ్డిలు కీలక పాత్రలను పోషించారు. అలా అనేది భాగోద్వేగాలను ఉత్తుంగ స్ధితికి తోడ్కొని వెళ్లే కథాంశాన్ని కలిగి ఉండగా, దీన్ని జూన్ 25, 2019 మొదటిసారిగా ప్రద్శించి చందాదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
అలా రచయిత, దర్శకుడు శరత్ పాలంకి మాట్లాడుతూ నేటి మన సమాజంలో కనిపించే పరిస్థితులకు మరియు అభద్రతా భావంతో మనం జీవిస్తున్న విధానాలకు అలా అద్దం పడుతుంది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒత్తిళ్లతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వారికి స్పూర్తితో కూడిన కథల ద్వారా వారు సమస్యల వలయం నుంచి ఎలా బయటప్పడ్డారన్నదే ఈ చిత్రం. దీని ప్రదర్శనకు మాకు జీ5 భాగస్వామిగా దక్కడం ద్వారా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా మేము మా ప్రేక్షకులను స్పూర్తి కలిగించగలిగితే అదే మా రాబడిగా భావిస్తామిని పేర్కొన్నారు.
అలా నటుడు భార్గవ్ కొమీర మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ని నేను విన్నప్పుడు, అది నన్ను ఆలోచనల్లో పడేసింది. అలా అనేది శక్తివంతమైన కథ మరియు క్రోధం మరియు నిర్లక్ష్యంతో కూడుకున్న నా పాత్ర స్వభావాన్ని పూర్తిగా మార్చివేసే స్పూర్తిదాయక కథ. ఈ సమయంలో ఈ కథను అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది మరియు ఎక్కువ మంది ప్రేక్షకుల ఆదరణ ఉన్న జీ5 ద్వారా మా సినిమాను ఎక్కువ మంది వీక్షిస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు.
జీ5 ఇండియా ప్రోగ్రామింగ్ హెడ్ అపర్ణ అచ్రేకర్ మాట్లాడుతూ జీ5 మేము మా ప్రేక్షకుల కోసం చక్కని కథా బలం ఉన్న కంటెంట్ లైబ్రరీను నిర్మించే ప్రక్రియను కొనసాగిస్తూ వస్తున్నాము. అందుకే, విలక్షణత, ధృడమైన కథాంశాలకు మేము ప్రాధాన్యత ఇస్తూ, అటువంటి వాటి కోసం మేము ఎక్కువ శ్రమను పెడుతున్నాము. మా ప్రేక్షకులు ప్రాంతీయ కంటెంట్ ను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఆసక్తితో కూడుకున్న మలుపులు ఉన్న కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాంతీయ భాషల మార్కట్లలో మేము ఇప్పటికే దక్కించుకున్న విజయాలను స్పూర్తిగా తీసుకుని ఈ అద్భుత కథను అందుబాటులోకి తీసుకు వచ్చాము. చక్కని పాత్రలతో వినూత్న కథను కోరుకునే వారి కోసం రూపొందించిన అలా అందరినీ ఆకట్టుకోనుంది. ఈ ఏడాది మేము సమర్పిస్తున్న సమర్ఫణల్లో ఆత్యుత్తమమైన వాటిలో ఒకటి కానుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
జీ5 ఇండియా బిజినెస్ హెడ్ మనీశ్ అగర్వాల్ మాట్లాడుతూ తమిళం, తెలుగు మరియు కన్నడల్లో మా ప్రాంతీయ ప్రీమియం ప్యాక్ లు విజయవంతమయ్యాయి మరియు ప్రతి ప్రేక్షకుడు తమకు ఇష్టమైన చిత్రాలు ఒరిజనల్స్ బిఫోర్ టీవీ కంటెంట్ ను తమ మాతృ భాషలోనే వీక్షించేందుకు అనువైన మోడల్ గా ఉన్నాయి. జీ5లొ మేము ఆయా భాషల్లో, వివిధ జానర్లలో అలానే అర్ధవంతమైన కథలలో వినూత్న కంటెంట్ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అలా అనేది మేము అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. అలా అనేది మేము అందుబాటులోకి తీసుకు వచ్చిన వినూత్న కథాంశం మరియు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మేము మా లైబ్రరీకి మరిన్ని అదనపు కథలను చేర్చే ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని వివరించారు.
జీ5 నిరుడు నవంబరులో ప్రాంతీయ ప్రీమియం ప్యాక్ లను అందుబాటులోకి తీసుకురాగా వినియోగదారుల నుంచి చక్కని ఆదరణ దక్కింది. జీ5 తెలుగు ప్రీమియం ప్యాక్ నెలకు రూ 49. మరియు ఏడాదికి రూ 499 ధరల్లో అందుబాటులో ఉంది. 3500 కు పైగా చిత్రాలు, 500+ టీవీ షోలు, 4000+ మ్యూజిక్ వీడియోలు, 35+ నాటకాలు మరియు 80+ లైవ్ టీవీ ఛానెళ్లను 12 భాషల్లో అందిస్తున్న జీ5 విశ్వవ్యాప్త మనోరంజనను, తన కంటెంట్ ను దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ప్రేక్షకులకు అందిస్తోంది.