గౌతమ్ అదానీకి వీఐపీ భద్రత..

75
Gautam
- Advertisement -

ఇప్పటికే మోడీ సర్కార్‌ అంబానీ, అదానీల కోసం పనిచేస్తుందన్న విమర్శలు వస్తున్న తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రసర్కార్. అదాని గ్రూప్ చైర్మన్ గౌతమి అదానికి ‘జెడ్’ కేటగిరీ వీఐపీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదానికి భద్రతా సమస్య ఉందని జాతీయ భద్రతా సంస్థలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

గౌతమ్ అదానికి కల్పించే జెడ్ కేటగిరీ భద్రత నిమిత్తం కమాండోలను కేటాయించాలని సెంట్రల్ రిజర్వ్‭డ్ పోలీసు ఫోర్సును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం ఆదేశాలకు మేరకు తొందరలోనే అదానికి సీఆర్‭పీఎఫ్ భద్రత కల్పించనుంది.

ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత, ఆయన భార్య నీతా అంబానీకి తక్కువ కమాండోలతో భద్రత కల్పిస్తున్నారు.

- Advertisement -