ఓవైసీకి జడ్‌ప్లస్ కేటగిరి

43
owaisi
- Advertisement -

మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించింది కేంద్రం. దీంతో అస‌దుద్దీన్‌కు సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు.

గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్‌ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్‌- ఘజియాబాద్‌ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.నిందితుల్లో ఒకరైన సచిన్‌ పండిట్‌ బీజేపీలో క్రియాశీలక కార్యకార్త.

నిందితుల నుంచి కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు. నిందులిద్దరిని కోర్టులో హాజరు పరుస్తాం చెప్పారు.

- Advertisement -