- Advertisement -
తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ గా మాజీ ఎంపీ వైసిపి సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. తాజాగా అధికారులతో చర్చించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపిస్తారని వార్తలు వచ్చినా ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఈపదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.
సుబ్బారెడ్డి పేరును ఖరారు చేస్తూ మరో రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సుబ్బారెడ్డి జగన్ కు బాబాయ్ అవుతారు. ఆయన జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త. సుబ్బారెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా టీడీపీ నేత పుట్టా మధు కొనసాగుతున్నారు.
- Advertisement -