టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా, డైరెక్టర్‌గా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. గురువారం వైవీ సుబ్బారెడ్డి ఈ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఉండగా ఆయన తన పదవీ కాలం ఇంకా ముగియకుండానే రాజీనామా చేశారు.
త్వరలో టీటీడీ పాలకమండలిని నియమించనుంది ఏపీ సర్కార్. ఇప్పటికే టీటీడీ ఛైర్మన్‌గా జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి నియమితులు కాగా ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు.
ఇక పాలనలో తనదైన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు వైవీ. ఇప్పటివరకు ఉన్న ప్రొటోకాల్ దర్శనంతో పాటు ఎల్1, ఎల్2, ఎల్3లుగా ఉన్న వీఐపీ బ్రేక్ దర్శనాల విభజనను రద్దు చేయాలనే సంచలన నిర్ణయాన్ని త్వరలో అనౌన్స్ చేయనున్నారట . టీటీడీ పాలకమండలి కొలువుదీరిన తర్వాత తొలి సమావేశంలోనే తన నిర్ణయాన్ని వెలువరించనున్నారని టీటీడీ వర్గాల సమాచారం.