శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని చెప్పారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వస్తున్న విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతను పాటిస్తున్నామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేశారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా 2023, మే 31 వరకు రూ.861 కోట్ల నిధులు వచ్చాయన్నారు. వివిధ బ్యాంకుల్లో 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు 8.24 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు.
Also Read:పడగడుపున ఇది తాగితే.. ఎన్ని ప్రయోజనాలో!
ఇప్పటివరకు 70 మంది దళారులను అరెస్ట్ చేశామని, 214 కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాల పునరుద్ధరణకు రూ.139 కోట్లు కేటాయించామన్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసిన ప్రతీ ఒక్క భక్తుడికి రసీదులు ఇస్తున్నామన్నారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని తెలిపారు.
Also Read:బిహార్‌లో విపక్షాల భేటీ..