ఐపీఎల్‌ 10:సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ..

242
Yuvraj's blitz proves too much for RCB
- Advertisement -

అంచనాల్ని నిలబెడుతూ.. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఐపీఎల్‌-10 దుమ్మురేపే ఆరంభంతో దూసుకొచ్చింది. ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన  తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 35 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది.  టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4వికెట్లకు 207 రన్స్ చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలో మంచి స్టార్టింగ్ దొరికిన తర్వాత బ్యాట్స్ మెన్ నుంచి సహకారం కరువైంది.

Yuvraj's blitz proves too much for RCB

వీరిద్దరు ఫస్ట్ వికెట్ కు 52 రన్స్ పార్ట్ నర్ షిప్ ఇచ్చారు. 24 రన్స్ చేసిన మన్ దీప్ ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. తర్వాత 3సిక్సర్లు, 2 ఫోర్లతో 32రన్స్ చేసిన గేల్ ను హుడా పెవిలియన్ చేర్చాడు. తర్వాత వచ్చిన హెడ్, జాదవ్ లు నిలకడగా ఆడారు. స్కోరును వంద పరుగులు దాటించారు. 116 రన్స్ దగ్గర 31 రన్స్ చేసిన జాదవ్ ను కట్టింగ్ రనౌట్ చేశాడు. కాసేపటికే 30పరుగుల చేసిన హెడ్ ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ షేన్ వాట్సన్ 22 రన్స్ చేసిన నెహ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. చివరి వరుస బ్యాట్స్ మెన్ లో స్టూవర్ట్ బిన్నీ ఒక్కడే 11 రన్స్ చేయగా మిగితా అంతా సింగిల్ డిజికే పెవిలియన్ చేరారు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సన్ రైజర్స్ బౌలర్లలో నెహ్రా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లో తలో రెండు వికెట్లు తీయగా… హుడా, బిపుల్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వార్నర్ 14 రన్స్ కే ఔటైనా మరో ఓపెనర్ ధావన్, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ హెన్రిక్స్ తో కలిసి ఇన్నింగ్స్ సెట్ చేశారు. ధావన్ 40 రన్స్ కు ఔటయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ సింగ్ దూకుడుగా ఆడాడు. 27 బంతుల్లోనే 7ఫోర్లు, 3 సిక్సర్లతో 62రన్స్ చేశాడు.  ఏ తడబాటూ లేకుండా సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన యువీ.. ఒకప్పటి తన మెరుపుల్ని గుర్తుకు తెచ్చాడు. యువీ పూర్తి లయ అందుకుని బ్యాటింగ్‌ చేస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో బుధవారం నాటి ఇన్నింగ్స్‌ నిదర్శనం. క్రీజులోకి రావడంతోనే పరుగుల వేట మొదలుపెట్టిన యువీ.. తనదైన శైలిలో శక్తిమంతమైన, కళాత్మకమైన షాట్లతో బౌండరీలు, సిక్సర్లు బాదాడు. అతను కేవలం 23 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడం విశేషం. హెన్రిక్స్ కూడా 52రన్స్ చేశాడు. చివర్లో హుడా, కట్టింగ్ ఫాస్ట్ గా ఆడి తలో 16 రన్స్ చేశారు.

సూపర్ బ్యాటింగ్ తో సన్ రైజర్స్ కు భారీ స్కోరు అందించిన యువరాజ్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. గురువారం పుణేలో జరిగే సెకండ్ మ్యాచ్ లో పుణె, ముంబయి తలపడనున్నాయి.

- Advertisement -