యూవీని ఆట పట్టించిన గంభీర్‌..

254
yuvraj singh
- Advertisement -

భారత్ క్రికెటర్ స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రియురాలు,,,బాలీవుడ్ నటి హాజల్ కీచ్‌ను పెళ్లి చేసుకున్నాడు. చండీగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేగఢ్ సాహిబ్ గ్రామం వద్ద ఉన్న ధార్మిక కేంద్రం బాబా రాందేవ్ సింగ్ డేరాలో వివాహ వేడుక జరిగింది. పంజాబీ సంప్రదాయం ‘ఆనంద్ కరాజ్’ పద్ధతిలో యువీ వివాహం జరిగింది. యూవీ పెళ్లి చేసుకోవడంతో.. టీమిండియా క్రికెటర్లు అందరూ మంచి సంతోషంగా ఉన్నారు. పనిలో పనిగా యువీ మీద విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి గౌతమ్ గంభీర్ కూడా చేరిపోయాడు.

yuvraj singh
పెళ్లిలో మంచి షేర్వాణీ ధరించిన యువరాజ్.. దాని కింద ఒక చెస్ట్ గార్డ్ ధరించి ఉంటాడని గంభీర్ అన్నాడు. పెళ్లి తర్వాత ఎదురయ్యే బౌన్సర్ల నుంచి మగాళ్లను కాపాడేందుకు ఇంత వరకు చెస్ట్‌ గార్డులు ఏవీ తయారుచేయలేదన్న విషయం తెలుసుకోవాలన్నాడు. అలాంటి బౌన్సర్లను మైదానంలోను, బయట ఎదుర్కోవాలంటే ఏం చేయాలో తన దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయని, ఈసారి కలిసినప్పుడు యూవీకి వాటిని చెబుతానని సరదాగా ట్వీట్ చేశాడు. పెళ్లయిన తర్వాత కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొత్త పెళ్లి కొడుక్కి సాయం చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా గంభీర్ ఆటపట్టించాడు.

yuvraj singh

yuvraj singh

ఇన్నాళ్లూ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఇలాంటి సరదా ట్వీట్లు చేస్తూ అందరినీ ఆటపట్టించేవాడు. ఇప్పుడు గౌతీ కూడా అలాగే చేస్తున్నాడు. చివరికి యూవీకి బెస్ట్ విషెస్ అందించాడు. అలాగే హైదరాబాదీ సొగసరి ఆటగాడు వివిఎస్‌ లక్ష్మణ్ కూడా ట్వీట్టర్ ద్వారా యూవీకి బెస్ట్ విషెష్ అందించాడు.

yuvraj singh

yuvraj_hazel_marriage

- Advertisement -