గంభీర్ వ్యాఖ్యలను సమర్ధించిన యువీ..!

255
gambir
- Advertisement -

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పాక్ మాజీ ఆటగాడు ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను ఎంపీ గౌతమ్ గంబీర్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఆఫ్రిదిని జోకర్‌తో పోలుస్తూ ట్వీట్ చేశారు గంభీర్.

ఈ నేపథ్యంలోనే ఆఫ్రిది వ్యాఖ్యలను ఖండించారు భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్. పీఎం నరేద్ర మోడీ పై షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలతో నిరాశ చెందాను. దేశం కోసం ఆడిన బాధ్యతాయుతమైన భారతీయుడిగా, నేను అలాంటి మాటలను ఎప్పటికీ అంగీకరించనని చెప్పాడు.

తాను ఎప్పుడూ ఆఫ్రీది చేసే ఏ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొననని పేర్కొన్నాడు భజ్జి. కాశ్మీర్‌లో భారీ సైన్యాన్ని మోహరించినందుకు మోడీ ని ఇటీవల ఆఫ్రీది విమర్శించారు మరియు అతని లోపల కరోనావైరస్ కంటే పెద్ద వ్యాధి ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్రిదిపై గంభీర్,యువీ,భజ్జి విమర్శలు గుప్పించారు.

- Advertisement -