కోహ్లిని టార్గెట్‌ చేసిన యువీ

514
yuvraj singh
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,కోచ్ రవిశాస్త్రిలే టార్గెట్‌గా మరోసారి అసహనం వ్యక్తం చేశాడు యువరాజ్ సింగ్. తాను ఫామ్‌లో ఉండగానే యో-యె టెస్టు పేరుతో తనను పక్కన పెట్టారని మండిపడ్డాడు.

కోహ్లి-రవిశాస్త్రి హయాంలోనే యో-యో టెస్టును ప్రారంభించడాన్ని  ప్రస్తావించిన యువీ…ఒక ఆటగాడు బాగా ఆడుతుంటే యో-యో టెస్టుతో పనేంటని ప్రశ్నించాడు.

క్యాన్సర్‌ నుంచి బయటపడ్డాక యువరాజ్‌ను యో-యో టెస్ట్‌ పాస్‌ కాలేదంటూ పలుమార్లు దూరం పెట్టారు. 2017లో వెస్టిండీస్‌ టూర్‌ నుంచి వచ్చాక ఇదే కారణంతో యువీని జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో యో-యో టెస్ట్‌పై పలుమార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన యువీ తాజాగా కోహ్లీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించాడు.

- Advertisement -