- Advertisement -
కరోనా నేపథ్యంలో అవగాహన కల్పించడంలో ముందువరుసలో ఉంటున్నారు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఇక కరోనా నేపథ్యంలో ఇప్పటికే వివిధ రకాల ఛాలెంజ్‌లు రాగా తాజాగా యువీ కొత్తఛాలెంజ్ను తెరపైకి తీసుకొచ్చాడు.
కీప్ టప్ ఛాలెంజ్‌ను ముందుకుతీసుకొచ్చిన యువీ…దీనిని సచిన్, రోహిత్,హర్భజన్ సింగ్‌లకు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశాడు యువీ.
ఈ వీడియోలో యువీ బాల్ కింద పడకుండా బ్యాట్ తో ఆడుతూ ఉన్నాడు. అలాగే కరోనాను నివారించడానికి ఇంట్లో ఉండటానికి నేను కట్టుబడి ఉన్నాను అనే సందేశాన్నిచ్చాడు. మరి యువీ ఇచ్చిన ఛాలెంజ్‌ను సచిన్, రోహిత్, భజ్జీ స్వీకరిస్తారో లేదో చూడాలి.
- Advertisement -