వెబ్‌ సిరీస్‌తో వస్తున్న…వరుణ్ సందేశ్

259
- Advertisement -

దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచపు ఓటీటీ నాయకుడు యప్ టీవీ, అసలైన వెబ్ సీరీస్ తో మళ్లీ మన ముందుకు వచ్చింది. ఎందుకిలా, మన ముగ్గురి లవ్ స్టోరిలతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన తర్వాత హే కృష్ణ యప్ టీవీ ఒరిజినల్స్ ప్రేక్షకులకు అందించే కొత్త వినోదం. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మరియు ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ఫేం ప్రముఖ తెలుగు రచయిత మహీ ఇల్లీంద్ర రాసిన హే కృష్ణలో వరుణ్ సందేష్, కాషిష్ ఒహ్రా, ‘వివా’ హర్ష, మౌనిమలు నటించారు. తెలుగు భాష అసలు వెబ్ సీరీస్ యప్ టీవీ వేదికపై లభిస్తుంది.

హే కృష్ణ , 25 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ. విసుగు పుట్టించే జీవితాన్ని కొనసాగిస్తూ, ఎప్పుడైనా , ఎవరైనా యువతిని ఆకర్షించాలని ప్రయత్నించినప్పుడల్లా తన ప్రయత్నాల్లో ఘోరంగా విఫలమవుతుంటాడు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనల తర్వాత (హాస్యంతో కూడినవి) తన బాధలన్నింటికి, తనకు ప్రేమ జీవితం ఏ మాత్రం లేకపోవటానికి కృష్ణ పరమాత్మ మూల కారణమని భావిస్తాడు. అయితే ఒక గట్టి నిర్ణయం తీసుకోవటంతో అది అతని జీవితాన్ని పూర్తి గా మార్చివేసింది. హైదరాబాద్ నవాబ్స్ తో సినిమాలో కొత్త ప్రామాణాల్ని రూపొందించిన శ్రీ లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంవహించిన హే కృష్ణ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తుంది.

YuppTV Originals latest web series  Hey Krishna

ఈ ప్రారంభంపై వ్యాఖ్యానిస్తూ యప్ టీవీ సీఈఓ మరియు స్థాపకులు శ్రీ ఉదయ్ రెడ్డి ఇలా అన్నారు, ‘ మా యూజర్లకు కొత్త వెబ్ సీరీస్, హే కృష్ణ తీసుకురావటానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. యువత ప్రధానంగా మలచిన ఈ వెబ్ సీరీస్ మా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. హే కృష్ణ తారాగణం, రచయిత, దర్శకుల ప్రతిభకు మరియు హే కృష్ణ తయారు కావటానికి కృషి చేసిన పూర్తి బృందానికి ధన్యవాదములు తెలపటానికి నేను ఈ అవకాశం వినియోగిస్తున్నాను. ‘

ఎపిసోడ్స్ రూపంలో కొనసాగే హే కృష్ణ 12 ఎపిసోడ్స్ వరకు ప్రసారమవుతుంది. హే కృష్ణ తయారు చేసినది ట్రెండ్ లౌడ్ కాగా స్క్రిప్ట్ ని తయారు చేసేవారు కథని తయారు చేసారు. నరేష్ కుమరన్ తన అత్యంత హృదయాన్ని తాకే సంఘటనల్ని ఒరిజినల్ సీరీస్ కి అందించారు. ఆసక్తి ఉన్న ప్రేక్షకులు యప్ టీవీలో ఇతర అంశాలతో పాటు నేరుగా సీరీస్ ని ఇప్పుడు చూడవచ్చు.

- Advertisement -