యుద్ధం ఆపే శక్తి మోదీకి ఉంది:వైట్‌హౌజ్‌

35
- Advertisement -

రష్యా ఉక్రెయిన్‌పై యుద్దాన్నికి యేడాది కావొస్తుంది. ఈ యుద్ధంను ముగింపు కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ యుద్ధం దాటికి ఆర్థిక చైన్‌ సిస్టమ్‌ చిన్నాభిన్నమైందని చెప్పవచ్చు. అయితే తాజాగా అమెరికా వైట్‌హౌజ్ ప్రతినిధి జాన్‌ కెర్బీ ఈ యుద్ధం ప్రభావంపై స్పందించారు. పుతిన్ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇంకా సమయం ఉందని నేను భావిస్తున్నాను. ప్రధాని మోదీ ఆయన్ను ఒప్పించగలరు. అందుకోసం ఆయన తీసుకునే ఏ చర్యలైనా మాకు అంగీకారమే.

ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితికి కారణమైన ఒకే ఒక వ్యక్తి పుతిన్‌. ఇతను యుద్ధాన్ని అపకపోగా క్షిపణులతో మరింత రెచ్చిపోతున్నారు. అక్కడి వ్యవస్థలను ధ్వంసం చేసి అక్కడి ప్రజలను మరింత ఇక్కట్లకు గురిచేస్తున్నారు అని అన్నారు. అయితే భారత భద్రతా సలహాదారు అజిత్ దోబాల్‌ మాస్కోతో పుతిన్‌తో సమావేశమైన మరుసటి రోజు ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

యుద్దం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఇరు దేశాలు భారత ప్రధాని మోదీ పలు దఫాలుగా చర్చించారు. అయితే తాజాగా అమెరికా గగనతలం మీద 40వేల అడుగుల ఎత్తులో మరొక నిఘా బెలూన్‌ను అమెరికా విమానాలు కూల్చివేశాయని కేర్బీ ప్రకటించారు. అయితే వారం రోజుల ముందే చైనాకు సంబంధించిన నిఘా బెలూన్‌ను కూడా కూల్చివేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

సొంత స్టిక్కర్లు ఉంటే నిధులు కట్‌…

ఎలక్షన్ కోడ్‌..సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

రాజ్యసభ…రజనీ అశోక్‌రావు సస్పెండ్‌

- Advertisement -