కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన వైఎస్ షర్మిల..

70
- Advertisement -

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు వైఎస్ షర్మిళ. తెలంగాణలో పార్టీ జెండా పీకేసీ కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. షర్మిలను కాంగ్రెస్‌లోకి తెచ్చేందుకు కేవీపీ రామచంద్రరావు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల వ్యూహం ఫలించింది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరికకు వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది.వైఎస్సాఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. పాలేరు నుండి పోటీకి షర్మిలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం వెల్లివిరుస్తోంది. నేడో రేపో కెవిపి రామచంద్రా రావు,డికె శివకుమార్ లతో షర్మిల భేటీ కానున్నారు.

Also Read:Adipurush:విమర్శలు – వివాదాలు.. వివరణ

- Advertisement -