రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు నామినేషన్ల పర్వం దగ్గరపడుతుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థని ప్రకటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ బీసీ అభ్యర్ధిని ప్రకటించి రంగంలోకి దిగనుండగా ఇప్పటివరకు 13 మంది నామినేషన్స్ దాఖలు చేశారు.
ఇందులో 12 మంది స్వతంత్రులు ఉండగా ఒకరు వైసీపీ అభ్యర్థి అని పేర్కొన్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఏప్రిల్ 17న ఎన్నికలు జరగనుండగా మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో సత్తా చాటే పార్టీ ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోండగా త్రిముఖ పోరా.. బహుముఖ పోటీయా అన్నది తేలాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఎన్నికల్లో పోటీచేయని వైసీపీ….సాగర్ బరిలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో షర్మిల పార్టీని ప్రకటించిన ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించగా తాజాగా వైసీపీ కూడా ఎన్నికల సంగ్రామంలో దిగడంతో ఎవరికి మేలు జరుగుతుందో వేచిచూడాలి.