ఎమ్మెల్సీ అనంత‌బాబును స‌స్పెండ్ చేసిన వైసీపీ..

165
MLC Anantha Babu
- Advertisement -

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో జైలుపాలైన ఎమ్మెల్సీ అనంత బాబుపై వైసీపీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది.. అనంత బాబును పార్టీ నుండి స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇటీవల తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అనంతబాబు.. అతడిని తానే హత్య చేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించారు. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

ఎమ్మెల్సీ అయ్యి ఉండి.. స్వయంగా హత్య చేయడం కలకలం రేపింది. రాజకీయంగా వేడి పుట్టించిన ఈ హత్యకేసు విషయంలో పోలీసులపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. వివాదం ఎక్కడ మొదలైంది.. ఎలా హత్య చేసింది అన్ని వివరాలను పూసగుచ్చినట్టు ఎమ్మెల్సీ అనంతబాబు విచారణలో పోలీసులకు తెలిపారు. ఈ హత్య కేసులో తప్పించుకునే వకాశం లేకపోవడంతోనే.. పోలీసుల ఎదుట లొంగిపోయారు.

- Advertisement -