- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసింది వైసీపీ. సంపదను సృష్టించి పేదవారికి పంచిపెడుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు… సంపద బదులు అప్పులు మాత్రం సృష్టిస్తున్నారని ఆరోపించింది. ప్రతివారం అప్పు తెస్తే తప్ప పూట గడవని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడింది.
విద్యాసంస్కరణల పేరుతో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను దూరం చేస్తుందని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేస్తూ తెలుగు మీడియంలోనే బోధన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించడం పేద పిల్లల పాలిట అశనిపాతంలా మారిందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేసింది.
బాబును నమ్మి మోసంపోవడం ప్రజలకు ఇది నాలుగోసారని ఎద్దేవా చేసింది. అన్ని పథకాలనూ మింగేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొండ చిలువలా సైలెంట్ గా ఉంటున్నారని వైసీపీ మండిపడింది.
Also Read:గేమ్ ఛేంజర్..న్యూ ఇయర్ ట్రీట్
- Advertisement -