మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నిరసన

9
- Advertisement -

కడప జిల్లా, పులివెందుల ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు భారీగా మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రైవేటీకరణ కారణంగా పేద విద్యార్థులకు వైద్య విద్య, సామాన్య ప్రజలకు వైద్యం దూరం అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కూటమి నాయకులకు లాభం చేకూర్చే విధంగా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మెడికల్ కళాశాలల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంగళవారం రోజు చేసే అప్పుతో కూడా పూర్తి చేయవచ్చని అవినాష్ రెడ్డి సూచించారు. “రూ. 5 కోట్ల విలువైన ఆస్తికి ఏడాదికి కేవలం రూ. 5 వేల బాడుగ ఏమిటి?” అని ప్రశ్నించారు. ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఇతర రాష్ట్రాలు సైతం వ్యతిరేకించాయని పేర్కొన్నారు. అలాగే, ప్రైవేటీకరణతో కళాశాలలకు ఏడాదికి రూ. 85 వేల బాడుగ మాత్రమే వస్తుందని వ్యాఖ్యానించారు.

చివరగా, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పట్టిన శని అని అభివర్ణించిన ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రజల సమస్యలపై వైఎస్‌ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

Also Read:భూటాన్ రాజుతో ప్రధాని మోదీ భేటీ

- Advertisement -