ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ!

1
- Advertisement -

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలి అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని.. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు? అని ప్రశ్నించారు.

వైసీపీ కార్పొరేటర్ల ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసి ధ్వంసం చేశారు.. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీషతో పాటు ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు అన్నారు. నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం అని చెప్పారు.

అలాగే హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది. . హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌గా టీడీపీకి చెందిన రమేశ్‌ ఎన్నికయ్యారు. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్‌ స్థానాలను అలాగే బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్‌ పదవులను కూడా టీడీపీ సొంతం చేసుకుంది. 40 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో 23 మంది మద్దతు పలకడంతో రమేశ్‌ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి.

తిరుపతి డిప్యూటీ మేయర్‌, నందిగామ, మున్సిపల్‌ చైర్మన్‌, పిడుగురాళ్ల వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. కోరం సరిపోకపోవడంతో ఎన్నికను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

Also Read:పంచాయతీ ఎన్నికలపై పొంగులేటి!

- Advertisement -