వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి చిన్న వయసులోనే అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. వైసీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ఆయన ప్యానల్ స్పీకర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం స్పీకర్ ఓం బిర్లా హాజరుకాకపోవడంతో ప్యానల్ స్పీకర్ బాధ్యతలను నిర్వర్తించారు మిథున్ రెడ్డి.
ఆరున్నర దశాబ్దాల తరువాత జిల్లాకు చెందిన ఎంపీ స్పీకర్ కుర్చీపై ఆశీనులయ్యారు. ప్యానల్ స్పీకర్‌గా మిథున్‌రెడ్డి ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడుతూ సభను నడిపారు.
జిల్లా నుంచి స్పీకర్ కుర్చీపై ఆశీనులైన వారిలో మిథున్‌రెడ్డి రెండో వ్యక్తి. 1952లో ఏర్పడిన తొలి లోక్‌సభలో జిల్లాకు చెందిన మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీఎంసీ బాలయోగి తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికి మరో మారు స్పీకర్ చైర్‌పై కూర్చునే అవకాశం దక్కింది. మిథున్‌రెడ్డి లోక్‌సభ స్పీకర్ కుర్చీలో ఆశీనులు కావడం పట్ల వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.