దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహీ వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ జగన్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న నిర్మాతలు మాట్లాడుతూ.. 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు, రైతుల ఆవేదన తెలుసుకున్న వైయస్ జీవిత భాగంపై సినిమా తీయడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. వైయస్ ఇమేజ్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించామని అన్నారు. వైయస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించారని తెలిపారు.
తాజాగా సినిమాలో మమ్ముట్టికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ఈ క్రమంలో దర్శకుడు తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా మమ్ముట్టితో ఇన్ని రోజుల ప్రయాణంలో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 60మందికి పైగా నూతన దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి మమ్ముట్టిగారు. అవన్నీ కాకుండా అతనొక గురువు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నారు. ఈ క్యారెక్టర్‌కి మమ్ముట్టిగారు తప్ప మరెవరు న్యాయం చేయలేరు. అతనిలో మ్యాజిక్ ఉంది. వండర్‌ఫుల్ పర్సన్. యాత్రలో భాగం అయినందుకు గొప్పగా ఉంది అని పోస్ట్‌లో తెలిపారు మహి వి రాఘవ.