రాజన్న అభిమానులు…..సీఎం కేసీఆర్ వైపే!

167
kcr
- Advertisement -

దివగంత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సంకల్ప సభ ద్వారా తాను తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని సూటిగా చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రతిన భూనారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అసలు రాజన్న రాజ్యం అంటే ఏంటో షర్మిలక్కకైనా క్లారిటీ ఉందో లేదో తెలియాలి.

2004లో వైఎస్‌ అధికారంలోకి రావడానికి ప్రధానంగా దొహదపడింది ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక, చేయడానికి పనులు లేక, ఓ వైపు కరెంట్ కోతలతో ఉమ్మడి ఏపీ కరువుతో విలవలలాడింది. ఈ క్రమంలో పాదయాత్ర చేపట్టిన వైఎస్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే కాదు రైతులకు ఉచిత కరెంట్, ఫీజు రీయంబర్స్ మెంట్, రుణమాఫీ వంటి పథకాలతో ప్రజలకు చేరువయ్యారు.

అయితే ఇదంతా రాష్ట్ర విభజనకు ముందు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న రాజ్యాన్ని మరపించింలేలా పాలనను సాగించింది. వైఎస్ హయాంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా కరెంట్ ఎప్పుడు ఉంటుందో లేదో తెలిసేది కాదు. రాత్రిపూట కరెంట్‌తో చాలామంది రైతులు పొలాల వద్దే ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాలు అనేకం.

కానీ నేడు ఆ పరిస్థితి లేదు. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది కేసీఆర్ సర్కార్. అలాగే గురుకులాలతో అందరికి కేజీ టూ పీజీ ఉచిత విద్యను అందిస్తూ సామాన్యలును చదువు భారం కాదని నిరూపించింది. ఇక వైఎస్ హయాంలో ఫించన్ 200 ఉంటే నేడు 2000. ఇక నాడు సీఎంఆర్ఎఫ్‌ అంటే కొందరికే వరం కాగా ఇప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌తో లబ్ది పొందిన పేదలు కొకొల్లలు. ఇక ఆరోగ్య శ్రీకి మరింత మెరుగులు దిద్ది పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతోంది. ముఖ్యంగా అన్నదాతల పాలిటవరంగా మారాయి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు. రైతు బంధుతో కర్షకుల బంధువైన సీఎం ….రైతు భీమాతో వారి కుటుంబాల్లో ఆసరగా నిలిచారు. దీంతో వరుసగా రెండోసారి ప్రజలు కేసీఆర్‌కు తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో రాజన్న అభిమానులు ఎవరిని కదిలించిన తమ పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది.

- Advertisement -