సి‌ఎం జగన్ కు ” చెల్లి పోటు “!

36
- Advertisement -

ఏపీలో గత నాలుగేళ్ల నుంచి సంచలనం సృష్టిస్తున్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ మిస్టరీ.. ఎటొచ్చీ ..ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. వివేకా హత్య కేసును తెలంగాణ సీబీఐ టేకోవర్ చేసిన తరువాత నుంచి దర్యాప్తులో వేగం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసును ఈనెల 30 నాటికి క్లోజ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉండడంతో సీబీఐ కూడా కేసును ముగించేందుకు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని. సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:నిమ్మరసంతో ఇన్ని ఉపయోగాలా!

ఇక ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన అరెస్ట్ పై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఈ నెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. అయితే అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకా కూతురు వైఎస్ సునీత రెడ్డి ఇంప్లిడ్ పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఆ పిటిషన్ లో ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించాచడం సంచలనంగా మారింది.

నిందితులకు క్లీన్ చీట్ ఇచ్చే విధంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని, అధకారంలో ఉన్నవాళ్ళు చేసే వ్యాఖ్యాలు కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆమె పిటిషన్ పేర్కొన్నారు. సి‌ఎం స్థాయి వ్యక్తి నిందితులకు క్లీన్ చీట్ ఇచ్చే విధంగా వ్యాఖ్యానించడం అనుమానాలకు తావిస్తోందని సునిత రెడ్డి పిటిషన్ లో అభిప్రాయ పడ్డారు. వైఎస్ అవినాష్ రెడ్డి తన తమ్ముడని, బాబాయ్ ( వివేకా ) ను చంపవలసిన అవసరం ఏముందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అసెంబ్లీలో మాట్లాడినా మాటలు విధితమే. మొత్తానికి వివేకా కేసు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ వద్దకు చేరడం ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు తెర లేచిందనే చెప్పాలి.

Also Read:Saindhav:వెంకీకి మూడో భామ ఫిక్స్

- Advertisement -