అక్కా ఇక జెండా ఎత్తేస్తే బెటరేమో..?

209
sharmila
- Advertisement -

వైఎస్ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్ షర్మిలకు ఇంతకంటే ఘోర అవమానం ఉండదు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ఆర్‌ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఎంత గొంతు చించుకున్నా రాజకీయ పార్టీలన్నీ ఆమెను లైట్ తీసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌కు పోవాలంటే సీమాంధ్ర ప్రజలకు పాస్‌పోర్ట్‌లు కావాలా…అదేమైనా పాకిస్తానా అంటూ కించపర్చిన షర్మిల..ఇప్పడు నేను తెలంగాణ కోడలిని అంటూ రాజకీయం చేస్తుంటే తెలంగాణ ప్రజలకు చిరాకేస్తోంది. అసలు షర్మిలను మీడియా తప్పా ఓ రాజకీయ నాయకురాలిగా, ఓ పార్టీ అధ్యక్షురాలిగా ఎవరూ గుర్తించడం లేదు. .టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే షర్మిలది పార్టీనే కాదు..ఓ ఎన్టీవో సంస్థ…మీడియా మిత్రులారా..దయచేసి ఆమెకు దూరంగా ఉండడండి అంటూ ఎద్దేవా చేసాడు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై విమర్శించడానికి అవకాశం లేకపోవడంతో ఒక్క నిరుద్యోగ సమస్యను పట్టుకుని మంగళవారం పెయిడ్ దీక్షలు చేస్తోంది. పరువులు, దిండ్లు పెట్టుకుని ఓ నాలుగు గంటలు డ్రామా రక్తికట్టించి మీడియాలో హంగామా చేస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోతే ఎక్కడ తన పార్టీని మూసుకుకోమని అంతా గేలి చేస్తారనే భయంతో తొలుత తమ పార్టీ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించింది.

అయితే టీఆర్ఎస్ అభ్యర్థిని దెబ్బ కొట్టి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను గెలిపించాలన్న కుట్రలో భాగంగా షర్మిల వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసికొట్టింది. . కనీసం 200 మంది నిరుద్యోగ యువకులతో నామినేషన్లు వేయించి కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాలని షర్మిల కుటిలయత్నాలు చేసింది. హుజురాబాద్‌లో పోటీచేసే నిరుద్యోగ యువతీ, యువకులకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేసే నిరుద్యోగులకు తగిన ఆర్థిక, ఇతరత్రా సాయం చేసేందుకు తమ పార్టీకి చెందిన నేతను కోఆర్డినేటర్‌గా నియమించింది. కాగా హుజురాబాద్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇటీవల ముగిసింది. వైఎస్సార్‌టీపీ మద్దతిస్తున్న అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరు కూడా నామినేషన్‌ వేయకపోవడంతో షర్మిల షాక్ అయింది. అయితే హుజురాబాద్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులు నామినేషన్లు వేయకుండా అధికారులు, పోలీసులు అడ్డుకుంటున్నారని షర్మిల ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారిని మార్చాలని కోరారు. షర్మిల ఎంత ధైర్యం కల్పించినా ఒక్క నిరుద్యోగి కూడా నామినేషన్‌ వేసేందుకు ముందుకు రాలేదు. కాగా హుజురాబాద్ నియోజకవర్గానికి చెందని వ్యక్తులు అక్కడ పోటీకి దిగాలంటే ఆర్డీవో వద్ద డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది.

చాలామంది అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వచ్చినా ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం వారి పత్రాలను రిజెక్ట్ చేయడంతో వెనుదిరిగినట్లు షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం వచ్చిన నామినేషన్లను తాము స్వీకరించామని, కావాలని ఎవరిని అడ్డుకోలేదని ఎన్నికల అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. మొత్తంగా ఎన్ని మంగళవారం దీక్షలు చేసినా షర్మిలను తెలంగాణ నిరుద్యోగ యువత కూడా పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక తెలంగాణలో షర్మిల పార్టీకి సీన్ లేదని,సీమాంధ్రకు చెందిన ఆమెను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారని, ఆమె తమ కోసం కాకుండా అధికారం కోసమే పార్టీ పెట్టిందని నిరుద్యోగ యువత కూడా నమ్ముతుందని అందుకే హుజురాబాద్‌లో ఒక్కరంటే ఒక్కరూ నామినేషన్ వేయలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కా.. ఎంత గొంతు చించుకున్నా లాభం లేదు..ఇక తట్టాబుట్టా సర్దుకుని తెలంగాణ నుంచి జెండా ఎత్తేస్తే బెటర్ అంటూ తెలంగాణ ప్రజలు షర్మిలకు చెప్పకనే చెబుతున్నరు..కాని సీఎం కుర్చీపై అత్యాశపడుతున్న అక్కకే ఇంకా అర్థం కావడం లేదు…అంతేగా..అంతేగా..!

- Advertisement -