షర్మిల కొడుకు రాజారెడ్డి లవ్ మ్యారేజ్?

91
- Advertisement -

వైఎస్ ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయా?..రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమలో పడ్డాడా…?ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రీసెంట్‌గా కడపలో భూమి రిజిస్ట్రేషన్ సందర్భంగా షర్మిల తన ఫ్యామిలీతో కలిసి చేరుకోగా ఆమె కొడుకు రాజారెడ్డి ఫోటోలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ హీరోను తలపించేలా షర్మిల కుమారుడు ఉండటంతో అప్పట్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా తాజాగా రాజారెడ్డి ప్రేమ వివాహనికి సంబంధించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. త్వరలో రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోనున్నారని.. యువతి పేరు ప్రియ అట్లూరి అని తెలుస్తోంది.

వీరిద్దరికి అమెరికాలో పరిచయం ఏర్పడిందని.. గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందగా చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా తెలుస్తోంది. ఇక దీనిపై అఫిషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. షర్మిలది కూడా ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. బ్రదర్ అనిల్ ని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిది కూడా ఇంటర్ క్యాస్ట్ వివాహామే.

Also Read:యానిమల్..తొలిరోజు వసూళ్లెంతో తెలుసా?

- Advertisement -