రైతుల గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరు: షర్మిల

51
ys
- Advertisement -

రైతుల గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె..2 కోట్ల మందికి బీజేపీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని…కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కరోనా తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల..ముందస్తు ఎన్నికలు వస్తే మాకు మంచిదేనన్నారు.

రైతు కు అప్పుల మీద అప్పులు పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు…ఆత్మహత్యలు చేసుకోకుండా ముఖ్యమంత్రి ఏనాడైనా భరోసా కల్పించారా అని ప్రశ్నించారు షర్మిల. పంట నష్టపోతే ఇన్సూరెన్స్ ఇస్తున్నారా…?వరి వద్దు ఇతర పంటలు వేసుకోవాలని కేసీఆర్ చెప్తున్నారు..మిర్చి ,పత్తి ప్రత్యామ్నాయ పంటలు కాదా…? అన్నారు.

ఎక్కడ చూసిన నకిలీ విత్తనాలు..నకిలీ ఎరువులు..నర్సంపేట లో మిర్చి రిసోర్స్ సెంటర్ ఏమైంది…?,వర్షాలకు పంట నష్టపోయిన పర్యటనకు వెళ్లిన మంత్రులు పరిహారం ఇచ్చారా…? అని అడిగారు షర్మిల. తాము ఏ పార్టీలతో కలిసేది లేదన్నారు.

- Advertisement -