షర్మిల రేవంత్ రెడ్డి.. ‘దోస్తీ రాజకీయం’!

30
- Advertisement -

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. నిన్నటివరకు కత్తులు దూసుకున్నవారే సడన్ గా దోస్త్ మేరా దోస్త్ గీతం అలపిస్తారు.. ఎప్పటి నుంచో మిత్రులుగా ఉన్నవాళ్ళు సడన్ గా శత్రువులుగా మారిపోతుంటారు.. ఇవన్నీ రాజకీయాల్లో తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా రేవంత్ రెడ్డి, షర్మిల విషయంలోనూ ఇదే జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ సడన్ గా షర్మిల కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో శతృత్వం కాస్త మిత్రుత్వం గా మారిపోయింది. ఇక ఇటీవల ఏకంగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతగా మారిపోయారు. దీంతో ఇప్పుడు మా షర్మిల అంటూ రేవంత్ రెడ్డి కొత్త పాట పడుతున్నారు..

దీంతో ఇదేనా రాజకీయమంటే అని ప్రజలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్న పరిస్థితి. ఏపీ కాంగ్రెస్ కు షర్మిల ప్రాతినిధ్యం వహిస్తుందని, ఆమెకు అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో ఈ దోస్తీ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో షర్మిలతో కలిసి రేవంత్ రెడ్డి కూడా పార్టీ బలోపేతం కోసం కృష్టి చేస్తారా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిద్దరిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే తెలంగాణనే ముఖ్యమని చెప్పిన షర్మిల ఎప్పుడు ఏపీ కాంగ్రెస్ లో చేరడం, అలాగే షర్మిలను తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మిత్రపక్షంగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు ప్రజల్లో నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:నెల రోజుల పాలన సంతృప్తా? అసంతృప్తా?

- Advertisement -