వైఎస్ బర్త్ డే సందర్భంగా పార్టీ పేరును ప్రకటిస్తానని తెలిపిన వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్ పాండ్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో ధర్నా చేసిన ఆమె తర్వాత అక్కడ దీక్ష నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆమె లోటస్ పాండ్‌లో తన దీక్షను కొనసాగిస్తున్నారు.
అయితే లోటస్ పాండ్‌లో మాస్క్ లేకుండా షర్మిల దీక్ష కొనసాగిస్తుండగా ఆము అనుచరులు కొందరు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో పాల్గొన్న పలువురు నేతలు వైరస్ బారిన పడ్డారు. షర్మిల ముఖ్య అనుచరుడు కొండ రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. సంగారెడ్డి ఇన్ చార్జి శ్రీధర్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు కరోనాతో ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో షర్మిల మాస్క్ లేకుండా దీక్షలో పాల్గొనడం విమర్శలకు తావిస్తోంది.