షర్మిల..” నో క్లారిటీ ” ?

55
- Advertisement -

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈమె సోలో గా బరిలోకి దిగుతున్నారా లేదా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. హస్తం పార్టీ తరుపున పోటీ చేయనున్నారా ? అనేదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ నేతలతో తరచూ భేటీ అవుతోంది. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో ఇప్పటికే ఆమె పలుమార్లు భేటీ అయ్యారు. అంతే కాకుండా గతంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసే షర్మిల.. ఈ మధ్య హస్తం పార్టీపై ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదు.

దీంతో ఆమె కాంగ్రెస్ కు దగ్గరవుతుందనే వాదన బలపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల తమతో టచ్ లో ఉన్నారని ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. దీంతో ఈ విషయాలపై షర్మిల క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ఇక ట్విట్టర్ వేదికగా షర్మిల మాట్లాడుతూ ” తాను చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా తెలంగాణ కొరకే పోరాడతానని, ఊహాజనిత కథలు కల్పిస్తూ.. తనకు తెలంగాణ ప్రజలకు దూరం పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పని లేని, పస లేని వ్యాఖ్యలు చేసే వారు తన రాజకీయ భవితపై పెట్టె దృష్టి కే‌సి‌ఆర్ పాలనపై పెట్టండి అంటూ.. తన భవిష్యత్, తన ఆరాటం, పోరాటం అన్నీ తెలంగాణ కోసమే ” అంటూ స్పష్టం చేశారు.

Also Read: VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..

అయితే షర్మిల చేసిన వ్యాఖ్యలలో అసలు కాంగ్రెస్ ప్రస్తావనే కనిపించలేదు. ఆమె హస్తం పార్టీకి మద్దతు ఇస్తున్నారా లేదా అనే దానిపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఎంతో తెలివిగా వ్యాఖ్యానించారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తో చేతులు కలపడంపై షర్మిల ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ఆమె అడుగులు హస్తం పార్టీ వైపు పడుతున్నాయనేది వాస్తవమంటూ కొందరి అభిప్రాయం.

Also Read: విపక్షాలకు బి‌ఆర్‌ఎస్ దూరం.. కారణం అదే !

- Advertisement -