అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయండి: షర్మిల

1
- Advertisement -

అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు వైఎస్ షర్మిల. వైసీపీ అధినేతకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఘాటుకు లేఖ రాశారు. అసెంబ్లీకి వెళ్లలేని ఎమ్మెల్యేలు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రజలను మోసం చేయడం కాదా అంటూ ప్రశ్నించారు. నేడు అసెంబ్లీలో మాట్లాడేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని , కేటాయింపులపై అడిగే బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు ఉందని గుర్తు చేశారు.

వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలను గమనించే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లనని జగన్‌ చెబుతున్నారు. స్వయంకృతాపరాధమేతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తించాలని సూచించారు. ఇంట్లో కూర్చుని మాట్లాడతం అంటే సరిపోదని , అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు.

Also Read:BRS:ధాన్యం కొనుగోలులో దళారుల రాజ్యం

- Advertisement -