తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఏపీపై దృష్టి పెట్టింది. ఏపీలో ఎలాగైనా సత్తా చాటలని బావిస్తోంది. అందులో భాగంగానే వైస్ షర్మిలకు పార్టీ బాద్యతలను అప్పగించి యమ దూకుడు ప్రదర్శిస్తోంది. షర్మిల అధ్యక్షురాలు అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ తరచూ చర్చల్లో నిలిస్తోంది. ఇకపోతే ఈసారి కాంగ్రెస్ 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తుందా లేదా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ పొత్తు వ్యవహారాలపై ఓ క్లారిటీ వచ్చింది. వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతునట్లు షర్మిల తాజాగా ప్రకటించారు. .
అధికార వైసీపీని ఢీ కొట్టాలంటే కలిసి పోరాడాలని అందులో భాగంగానే కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఆమె ఇటీవల వెల్లడించారు. అయితే సీట్ల షేరింగ్ పై మాత్రం షర్మిల ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నెల 26 న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో వామపక్షాలతో పొత్తు, సీట్ల షేరింగ్ పై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతుండడంతో చర్చనీయాంశం అవుతోంది. అయితే తెలంగాణతో పోల్చితే ఏపీలో ఈ రెండు పార్టీలకు ఏ మాత్రం బలం లేదు. అందువల్ల కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేసిన ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదనేది కొందరి అభిప్రాయం. మరి ఏపీలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న హస్తం పార్టీకి ఈ ఎన్నికలు ఎలాంటి ఫలితాలను కట్టబెడతాయో చూడాలి.
Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?