బెట్టింగ్‌లో చనిపోతే.. విగ్రహాలు కడతారా?

7
- Advertisement -

బెట్టింగ్‍లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలకు జగన్ పరామర్శా? అని ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బెట్టింగ్‍లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడమేంటి? అని ప్రశ్నించారు.

జగన్ నిన్నటి బలప్రదర్శనలో ఇద్దరు చనిపోయారు…. జగన్ బలప్రదర్శనలో ఇద్దరి మృతికి బాధ్యులెవరు? చెప్పాలని డిమాండ్ చేశారు. బలప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.

ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి? అన్నారు. జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బలప్రదర్శనలు కాదు అని జగన్‌కు చురకలు అంటించారు.

Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!

- Advertisement -