ప్రజలకు షాక్‌ల మీద షాక్‌ ఇస్తున్న బాబు!

6
- Advertisement -

ఏపీలో ట్రూ అప్ చార్జీలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు బాబు షాకుల మీద షాకులు ఇస్తున్నారు అన్నారు.

అవి ట్రూ అప్ చార్జీలు కాదు సామాన్యుడి నడ్డి విరిచే చార్జీలు, ప్రజలను పీల్చి పిప్పి చేసే చార్జీలు ఇవి అని మండిపడ్డారు. ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారం మోపారు…ఇది చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల మేర అధిక భారం మోపాలని చూడటం దుర్మార్గం అన్నారు.

ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటి? … ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి? అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది నమ్మక ద్రోహం… గత ప్రభుత్వం తప్పు చేసినా.. ప్రజా కోర్టులో పడే శిక్ష మీకే అన్న సంగతి చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి అన్నారు.

Also Read:భారత్‌పై ట్రంప్ మరో బాంబ్..!

- Advertisement -