Jagan:ఈవీఎంలపై జగన్ ట్వీట్

7
- Advertisement -

ఈవీఎంలపై దేశవ్యాప్తంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఈవీఎంలతో ఎన్నికలపై సమీక్షించాలని సూచించగా తాజాగా మాజీ సీఎం జగన్ సైతం స్పందించారు. ఈవీఎంల స్థానంలో పేపర్‌ బ్యాలెట్ వాడితేనే ప్రజాస్వామ్యం ఫరడవిల్లుతుందని ఎక్స్ ద్వారా వెల్లడించారు.

న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అని పేర్కొన్నారు.

Also Read:Pushpa 2:అందుకే ఆలస్యం..మేకర్స్ క్లారిటీ!

- Advertisement -