- Advertisement -
ఏపీ మాజీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు హాజరుకానున్నారు జగన్.
అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించడం.. వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయడంతో జగన్ హాజరు కావడం తప్పనిసరైంది.
Also Read:సత్యసాయి శత జయంతి వేడుకల్లో మోదీ
ఈనెల 21లోపు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు రానున్నారు జగన్. చివరిసారిగా 2020 జనవరి 10న కోర్టుకు హాజరయ్యారు జగన్. గతంలో సీఎం హోదాలో విచారణకు హాజరుకాలేనని అనుమతి తీసుకున్నారు జగన్.

- Advertisement -

