ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్!

2
- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు మాజీ సీఎం జగన్. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించనున్నారు.

ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అంతకుముందు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. మండలి సమావేశాలకు మాత్రమే వైసీపీ హాజరైంది

9.30కు తమ చాంబర్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కూడా ఉండబోతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు.

Also Read:అవిసె గింజలతో మలబద్దకంకు చెక్!

- Advertisement -