అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అందలేదు. మూడు వారాలు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం..నష్టపరిహారం అందివ్వకపోతే బాధితుల తరపున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. అవసరమైతే తానే వచ్చి ధర్నాలో కూర్చుంటానని తెలిపారు.
ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు.. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి ఉందన్నారు.
గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించిందని..కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదేనని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. పరిశ్రమ భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి రెడ్ బుక్ పేరుతో పగలు ప్రతీకారాల మీద దృష్టి పెట్టిందని జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:అజీర్తితో బాధపడుతున్నారా.. అయితే?