కేసీఆర్‌ వ్యాఖ్యలు హర్షణీయం-వైఎస్ జగన్

238
- Advertisement -

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ను తాను స్వాగతిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి, అవసరమైతే హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన వ్యాఖ్యానించడం హర్షణీయమని అన్నారు.

సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఆహ్వానించాల్సింది పోయి దానిని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదని జగన్‌ హితవు పలికారు. మనకున్న ఎంపీలకు తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా తోడైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావొచ్చు’ అన్నారు వైఎస్ జగన్.

YS Jagan

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో పోరాడి కేసీఆర్ విజయం సాధించారని, గడచిన ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు చేసినట్టుగా కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలతో ఎన్నడూ సంసారం చేయలేదని, తనదైన పాలనతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని అభిప్రాయపడ్డారు. హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకుని, కలిసి పోటీ చేద్దామని కేటీఆర్‌తో చంద్రబాబు మాట్లాడారని, చంద్రబాబు సంగతి తెలిసే టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను పక్కన బెట్టిందని జగన్ అన్నారు.

- Advertisement -