పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్

10
- Advertisement -

తన సొంత నియోజకవర్గం పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్‌ని ప్రారంభించారు మాజీ సీఎం జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించారు జగన్. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది.

పులివెందులలో వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేదు. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజారెడ్డి ఆస్పత్రి కొన్ని దశాబ్దాలుగా పులి వెందులలో సేవలు అందిస్తోంది. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట.

Also Read:ప్రధానితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

- Advertisement -