య‌జ్ఞంలా స‌మ‌గ్ర రీ స‌ర్వే చేప‌ట్టాం:జగన్

4
- Advertisement -

భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వందేళ్ల తరువాత ఒక యజ్ఞంలా రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీ సర్వే చేపట్టామని అన్నారు. భూ రికార్డులను ఎవ్వరూ ట్యాంపరింగ్ చేయలేని విధంగా పటిష్టమైన, పారదర్శక వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

బ్రిటీష్ పాలన తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమూ భూముల రీ సర్వే చేయడానికి సాహసించలేదని గుర్తుచేశారు. కానీ 2020 డిసెంబర్ 21న తమ ప్రభుత్వం ఈ చారిత్రక అడుగు వేసిందని, ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయమని జగన్ పేర్కొన్నారు. ఈ రీ సర్వే వల్ల రైతులకు న్యాయం జరుగుతుందని, భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. భూముల విషయంలో క్రెడిట్ చోరీ చేయగల వ్యక్తి చంద్రబాబు తప్ప మరెవ్వరూ లేరని ఆరోపించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు భూముల రీ సర్వే చేసి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు.

ప్రజలు అనేక రకాల భూసమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, రైతుల సమస్యలను చంద్రబాబు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని జగన్ నిలదీశారు. భూ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వమే నిజాయితీగా పనిచేసిందని మాజీ సీఎం స్పష్టం చేశారు.

Also Read:‘స్వయంభూ’..విడుదల తేదీ వాయిదా!

- Advertisement -