ప్రపంచ వ్యాప్తంగా YouTube సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వినియోగదారులు వెల్లడిస్తున్నారు. మొబైల్, డెస్క్‌టాప్‌లలో యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే వీడియోలు ప్లే కాకపోవడంతో పాటు పేజీ సరిగా లోడ్ కావడం లేదని చెబుతున్నారు.
యాక్సెస్ చేయాలని చూస్తున్నప్పుడు ‘Something went wrong’ అనే సందేశం కనిపిస్తోందని అనేక మంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరికి హోమ్ పేజీ ఓపెన్ అయినప్పటికీ వీడియోలు స్టార్ట్ కావడం లేదని సమాచారం.
ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపమా లేదా సర్వర్ సమస్యనా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. యూట్యూబ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. అప్పటివరకు సేవలు పూర్తిగా పునరుద్ధరించబడే వరకు యూజర్లు అసౌకర్యం ఎదుర్కొంటున్నారు.
Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

