పవన్ దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది

54
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి టీజర్ గ్లింప్స్ విడుదలై ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తుంది. ఎవరూ ఊహించలేని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్ప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. 24 గంటలు తిరగకుండానే 10 మిలియన్ వ్యూస్, 451K లైక్స్ ని సొంతం చేసుకుంది. 16 గంటల్లోనే ఈ రేంజ్ వ్యూస్ రాబట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్, మిగిలిన 5 గంటల్లో ఇంకో 6 మిలియన్ వ్యూస్ రాబట్టే ఛాన్స్ ఉంది.

ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో చింపేశాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ను పరోక్షంగా విమర్శిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Also Read: రంగబలి జూలై 7న విడుదల

‘భగత్ సింగ్ లాంటి నాయకుడి పేరును టైటిల్ పోస్టర్‌లో కింద పెట్టడం అనేది ఆ నాయకుడినిఅవమానించడమేనని, ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా’ అని పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసి పూనమ్ కౌర్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. ఏది ఏమైనా పూనమ్ కౌర్ ఇలా పవన్ పై నిత్యం విమర్శలు చేయడం కరెక్ట్ కాదు.

Also Read: నటుడిగా నా తప్పులు నేనే వెతుకుంటా: నాగచైతన్య

- Advertisement -