అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రెండవ సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఈసినిమాతో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగాలకు డిమాండ్ పెరిగింది. ఈమూవీ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. అక్కడ కూడా ఈసినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి. తెలుగులో కంటే హిందీలోనే సందీప్ కు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ లో టీ సిరీస్ నిర్మాణ సంస్ధలో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సందీప్ తర్వాతి సినిమా తెలుగులోనే తీయనున్నాడని తెలుస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ సినిమా చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల టాక్. డార్క్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈమూవీకి డెవిల్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.