కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్..

269
prabhas prashanth nil
- Advertisement -

యంగ్ రెబ‌స్ స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం రెండు సనిమాల్లో బిజీగా ఉన్నాడు. సుజిత్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సాహో, అలాగే జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జాన్ ఏక‌కాలంలో రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈఏడాది ఆగ‌స్ట్ 15 న సాహో మూవీ విడుద‌ల కాగా ఇదే ఏడాద చివ‌ర్లో జాన్ మూవీ కూడా విడుద‌ల కానుంది. ఒకే సంవ‌త్స‌రంలో ప్ర‌భాస్ రెండు సినిమాలు విడుద‌ల కావ‌డంతో ప్ర‌భాస్ అభిమానులకు పండ‌గగా చెప్పుకోవ‌చ్చు.

kgf

ఇక ప్ర‌భాస్ త‌న త‌ర్వాతి మూవీ గురించి ఆలోచిస్తున్నాడ‌ట‌. కేజీఎఫ్ మూవీ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ఇటివ‌లే ప్ర‌భాస్ తో భేటీ అయ్యాడ‌ని తెలుస్తుంది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ మూవీ రానుంద‌ని స‌మాచారం. ప్ర‌భాస్ ప్ర‌శాంత్ నీల్ క‌థ కూడా చెప్పాడ‌ని క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలీం న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

dil raju

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు న‌డిపిన‌ట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈమూవీని నిర్మించాల‌ని చూస్తున్నారు. దాదాపు 200కోట్ల‌త ఈమూవీని తెర‌కెక్కించాల‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రెండు సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ మూవీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -